గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేష్..
ABN, Publish Date - Sep 07 , 2024 | 02:29 PM
విజయవాడ: బెజవాడను ముంచెత్తిన బుడమేరు గండ్ల పనులను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ బుడమేరు వద్దకు వచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పరిశీలించారు. 12:30 గంటల ప్రాంతంలో మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి కావడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఫలించడంతో అనుకున్న దానికంటే తక్కువ సమయంలో మూడో గండి పూడ్చే పనులు పూర్తి అయ్యాయి. గండి పూడ్చివేత పనులు పూర్తయిన వెంటనే గట్టు పటిష్టత పనులు కూడా పూర్తి స్థాయిలో వేగంగా చెయ్యాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి బుడమేరు గండ్లు పూడ్చే పనులు పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్...
బుడమేరును పరిశీలిస్తున్న మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి కావడంతో పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్..
గండ్ల పూడ్చివేత పనులు పూర్తి కావడంతో.. గట్టు పటిష్టత పనులపై దృష్టి సారించిన లోకేష్..
బుడమేరు మూడు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి కావడంతో వాటిని మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పరిశీలిస్తున్న నారా లోకేష్.. ఎమ్మెల్మే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు..
వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుకు అందజేస్తున్న దృశ్యం..
Updated Date - Sep 07 , 2024 | 02:29 PM