సోమశిలాను సందర్శించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Aug 20 , 2024 | 11:41 AM
నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న ఏప్రాన్ పనులను పరిశీలించి, మరమ్మతులకు గురైన గేట్లను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిలకు అత్యవసరంగా చేయాల్సిన మరమ్మతుల పనులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమశిల గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా వచ్చినప్పుడు, అధికారులు సబ్జెక్టు బాగా స్టడీ చేసి అన్ని వివరాలతో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వస్తు్న్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ..
సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తున్న సంబంధిత అధికారులు..
సోమశిల ప్రాజెక్టును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
సోమశిల రిజర్వాయర్ డ్యామ్ చిత్రాన్ని వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు..
వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టు రక్షణ కట్ట, స్పిల్ వేలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్న దృశ్యం.
సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు..
Updated Date - Aug 20 , 2024 | 11:41 AM