TDP: ఎమ్మిగనూరు స్వర్ణాంధ్ర సాకార సభలో బాలకృష్ణ
ABN, Publish Date - Apr 17 , 2024 | 08:46 AM
కర్నూలు జిల్లా: స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో పర్యటించారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జాబ్‌క్యాలెండర్ అని, సీపీఎస్ రద్దని, మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు జగన్ అంటూ ధ్వజమెత్తారు. కాగా ఏ పల్లెకు వెళ్లినా తమ అభిమాన నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ రాక కోసం గంటలు తరబడి యువకులు, మహిళలు, రైతులు ఎదురు చూశారు. బాలకృష్ణ రాగానే జై బాలయ్య అంటూ హోరెత్తించారు. జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం బాలకృష్ణ యాత్రలో పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరుకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో ఎండ వేడిని కూడా లేక్కచేయకుండా అభిమానులు, కార్యకర్తలు చప్పట్లు, ఈలలు వేస్తూ.. జై బాలయ్య అంటూ హోరెత్తిస్తున్న దృశ్యం.
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన సభకు టీడీపీ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజానీకం..
ఎమ్మిగనూరులో నందమూరి బాలకృష్ణ నిర్వహించిన రోడ్ షోకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం..
Updated Date - Apr 17 , 2024 | 08:46 AM