ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:58 PM

అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు 2026లో సిద్ధంగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అహ్మదాబాద్-ముంబయి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పొడవు 508 కిలోమీటర్లు గా ఉంది. 2028లో పూర్తిస్థాయి విస్తరణ పూర్తవుతుందని ఆయన అన్నారు. తద్వారా ఈ ప్రాజెక్టు మార్గంలోని పట్టణాలు, నగరాల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.

జపాన్ కు చెందిన షింకన్‌సెన్ టెక్నాలజీ సహాయంతో రూ. 1.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. 2026 నాటికి సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. థానే నుంచి ముంబయి చేరుకోవడానికి ఈ మార్గం సముద్ర సొరంగం గుండా సాగుతుంది. ఈ మేరకు సముద్ర సొరంగం పనులు ప్రారంభమయ్యాయి.


ముంబయి, అహ్మదాబాద్ మధ్య మొదటి హై-స్పీడ్ రైలు కారిడార్ 320 కిమీ వేగంతో బుల్లెట్ రైళ్లను నడుపుతుందని కేంద్రం 2017లోనే ప్రకటించింది. రైల్వేల ద్వారా అధునాతన ప్రణాళికకు అన్ని స్థాయుల్లో కృషి, కమ్యూనికేషన్ అవసరమని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 03:58 PM

Advertising
Advertising