ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ram Temple in Sukma: 21 ఏళ్ల తరువాత తెరుచుకున్న రామ మందిరం.. గ్రామస్తుల సంబరాలు..

ABN, Publish Date - Apr 10 , 2024 | 01:39 PM

Ram Temple in Sukma: నక్సలైట్ల కార్యకలాపాల కారణంగా 21 ఏళ్లపాటు మూతపడిన రామ మందిరం(Ram Temple) ఎట్టకేలకు తెరుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బస్తర్ ప్రాంతంలో(Bastar) గల పురాతన రామాలయ ద్వారాలను మళ్లీ ఇన్నాళ్లుకు తెరిచారు. బస్తర్ డివిజన్‌లోని సుక్మా జిల్లా(Sukma District) ప్రధాన కార్యాలయం నుండి..

Ram Temple in Sukma

Ram Temple in Sukma: నక్సలైట్ల కార్యకలాపాల కారణంగా 21 ఏళ్లపాటు మూతపడిన రామ మందిరం(Ram Temple) ఎట్టకేలకు తెరుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బస్తర్ ప్రాంతంలో(Bastar) గల పురాతన రామాలయ ద్వారాలను మళ్లీ ఇన్నాళ్లుకు తెరిచారు. బస్తర్ డివిజన్‌లోని సుక్మా జిల్లా(Sukma District) ప్రధాన కార్యాలయం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్లపెండ గ్రామంలో ఈ ఆలయం ఉంది. రామాలయాన్ని తెరిచిన తరువాత గ్రామస్తులు ఆలయాన్ని ప్రాంగణాన్ని శుభ్రం చేసి, సాధారణ పూజలను ప్రారంభించారు. శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలకు అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు.

సుక్మా జిల్లాలో నక్సల్స్ ప్రభావితం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా.. రామాలయం గత 21 ఏళ్లుగా తెరుచుకోలేదు. తాజాగా ఆలయం ఓపెన్ అవగానే.. స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆలయం ఓపెన్ చేయడం అంతా ఈజీ ఏమీ కాలేదు. సీఆర్‌పిఎఫ్ బలగాల రక్షణలో స్థానిక ప్రజలు ఈ ఆలయాన్ని పునఃప్రారంభించారు. 2003లో ఈ ఆలయాన్ని నక్సలైట్లు బలవంతంగా మూసివేశారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వివరించారు. నక్సల్స్ కార్యకలాపాలు ఎక్కువై.. స్థానిక ప్రజలను సైతం భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరవవద్దని హెచ్చరించినట్లు ఎస్పీ వివరించారు. దాంతో రామాలయం 21 ఏళ్లుగా మూతపడిపోయింది.

వాస్తవానికి ఈ ఆలయం మూసివేత వెనుక మావోయిస్టుల వ్యూహాత్మక ప్రణాళికలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. చవాన్ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. తరచుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటారట. వారి మనుగడకు ఈ ప్రాంతం చాలా కీలకమైంది. అందుకే.. ఈ ప్రాంతంలో జన సంచారం అధికంగా ఉండకుండా ఆలయాన్ని మూసివేయించినట్లు పోలీసులు వివరించారు. 2003లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకుని మూసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 01:41 PM

Advertising
Advertising