Home » Ram Mandir
అయోధ్య రామమందిర వ్యవహారాలను పర్యవేక్షించే సీఈఓ ఎంపిక కోసం ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూ పానల్ వివిధ రకాల ప్రశ్నలను అడిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. మార్చి 31, 2026 నాటికి ట్రస్ట్ ఆధీనంలో 32.259 కేజీల బంగారం.. 1,518.925 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్పష్టం చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ట్రస్ట్ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసిన వాళ్లు.. ఆ కానుకలను కరిగించి బంగారం బిస్కట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది.
విరాళాల లెక్కింపు వ్యవస్థలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది.
రామ్ మందిర్ విరాళాల వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం స్పందించింది. అయోధ్య హుండీల నుంచి డబ్బులు దొంగతనం చేయటంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
చంపత్ రాయ్‌పై ‘ది బార్ అసోసియేషన్ ఆఫ్ ఫైజాబాద్’ లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య జిల్లాలోని రామజన్మ భూమి పోలీస్ స్టేషన్‌లో చంపత్ రాయ్‌తో పాటు అనిల్ మిశ్రా, కృష్ణ దేవ్, గోపాల్ రావ్‌లపై కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hanuman Garhi Temple: మూడు వందల ఏళ్ల ఆచారాన్ని బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. అది కూడా రాముడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ హనుమంతుడి గుడికి అతి దగ్గరలో అయోధ్య రామ మందిరం ఉంది. ప్రేమ దాస్ రామ మందిరానికి వెళ్లాలనుకుంటున్నారు. ప్రేమ్ దాస్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ బలమైన కారణం ఉందట.
బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.