అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: విశ్వహిందూ పరిషత్
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:52 PM
అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్పష్టం చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ట్రస్ట్ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ, జులై 6 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ (Surendra Jain) స్పష్టం చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ఈ ట్రస్ట్ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సురేంద్ర జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కారని వ్యాఖ్యానించారు. అయోధ్య విరాళాల అక్రమాలపై జరుగుతున్న 'సిట్' (SIT) దర్యాప్తు ముగింపు వరకు వేచి చూడాలని సూచించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు నైతిక బాధ్యతతోనే రాజీనామా చేశారని పేర్కొన్నారు.
కొందరిని దోషులుగా చిత్రీకరించడం తగదు..
ఈ విచారణ ముగియక ముందే కొందరిని దోషులుగా చిత్రీకరించడం తగదని సురేంద్ర జైన్ హితవు పలికారు. దర్యాప్తు నుంచి చంపత్ రాయ్ ఎప్పుడూ తప్పించుకోలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. రామమందిర ట్రస్ట్‌లో పారదర్శకతను పెంచేందుకు, పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు వీహెచ్‌పీ మద్దతు ఇస్తోందని తెలిపారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు.
ఆలయాల నిర్వహణను హిందూ సమాజమే చూసుకోవాలి..
ఆలయాల నిర్వహణను దేశంలోని సాధువులు, హిందూ సమాజమే చూసుకోవాలని సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. అవినీతిపై ఆందోళనతో కాదని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.
అయితే, రామజన్మభూమి ట్రస్ట్ కీలక సమావేశం ఈరోజు(సోమవారం) ప్రారంభమైంది. రాజీనామాల ఆమోదం, కొత్త నియామకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News