Share News

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:59 PM

కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు.

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జులై 5 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీఐ క్యాపిటల్స్‌‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యంతో మెట్రో ఫేజ్-2 వ్యయం పెరిగే ప్రమాదం అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్రం జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.


కేంద్రప్రభుత్వం తక్షణ ఆమోదం ఇవ్వాలి..

అలాగే, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రప్రభుత్వం తక్షణ ఆమోదం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్రంతో రాష్ట్రం చర్చలు జరిపిందని చెప్పారు. మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణకు ఎస్‌బీఐ క్యాపిటల్స్‌ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ఫేజ్-1 రుణాల రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్‌బీఐ క్యాపిటల్స్ పరిశీలించనుందని వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యం..

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ క్యాపిటల్స్‌కు బాధ్యతలు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫేజ్-1 స్వాధీనం ఆలస్యంతో మెట్రో నిర్వహణపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని అన్నారు. ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆలస్యం కారణంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఎస్‌బీఐ క్యాపిటల్స్‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర రవాణా అభివృద్ధికి మెట్రో విస్తరణ అత్యంత కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 03:03 PM