Share News

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:10 PM

వరంగల్ నగరంలోని ప్రముఖ భద్రకాళీ ఆలయం వద్ద ఈరోజు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయంలో స్నానాలు చేయడం వల్ల ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ, ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
Warangal Bhadrakali Temple

వరంగల్ జిల్లా, జులై 4 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలోని ప్రముఖ భద్రకాళీ ఆలయం (Warangal Bhadrakali Temple) వద్ద ఈరోజు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయంలో స్నానాలు చేయడం వల్ల ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ, ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.


అయితే, పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు బీజేపీ నాయకులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని పేర్కొంటూ సంప్రోక్షణ నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా వారిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రకాళీ ఆలయం వద్ద జరిగిన ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం.. మంత్రి పొన్నం సవాల్

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 12:16 PM