కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:47 AM
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) పేర్కొన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. తప్పు చేయలేదనే నమ్మకంతోనే ప్రజల ముందుకు వచ్చి మంత్రులు చర్చకు సిద్ధమయ్యారని చెప్పారు. అలాగే హరీశ్‌రావు అండ్ కో చర్చకు రావాలని కోరితే వారు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విమర్శలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గురుకులాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు మంత్రులు ముందుకొచ్చారని దానం నాగేందర్ పేర్కొన్నారు.
కాగా, గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్ బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పలు అంశాలపై చర్చించడానికి రెడీ అని చెప్పారు.
అయితే, ఈరోజు కాంగ్రెస్ మంత్రులు మొదటగా అసెంబ్లీకి బయలుదేరారు. అనంతరం గన్‌పార్క్‌కు చేరుకుని తమ సన్నద్ధతను ప్రకటించారు. గురుకులాల వ్యవహారంలో తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అవినీతి ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని మంత్రులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News