రాముడి కానుకలన్నీ సేఫ్.. స్పష్టం చేసిన రామ్ మందిర్ ట్రస్ట్
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:35 PM
అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. మార్చి 31, 2026 నాటికి ట్రస్ట్ ఆధీనంలో 32.259 కేజీల బంగారం.. 1,518.925 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
లఖ్‌నవూ, జులై 7: అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. మార్చి 31, 2026 నాటికి ట్రస్ట్ ఆధీనంలో 32.259 కేజీల బంగారం.. 1,518.925 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో రామాలయ ట్రస్ట్ కానుకల లెక్కలు తేల్చింది. మాయమయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన బంగారు రామచరితమానస్, వజ్రాల నెక్లెస్, వెండి పాదుకలను ట్రస్ట్ సభ్యులు మీడియా సమక్షంలో ప్రదర్శించారు.
ప్రతి కానుకకూ దాత వివరాలతో సహా రికార్డులు ఉన్నాయని ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ఏటా స్వతంత్ర సీఏ సంస్థతో భౌతిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఇచ్చిన 849 కేజీల వెండి వస్తువులను భారత ప్రభుత్వ మింట్ ద్వారా కరిగించి, శుద్ధి చేసి భద్రపరిచామని గోవింద్ పేర్కొన్నారు.
కాగా, విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కృష్ణ మోహన్‌ను నియమించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక సీఈఓ నియామకానికి నిర్ణయం తీసుకుంది. సిట్ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. 'ఎక్స్' అకౌంట్‌ను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
సంజును పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: మహ్మద్ కైఫ్