అయోధ్యలో విరాళాల లెక్కింపు.. అమల్లోకి కఠిన నిబంధనలు..
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:27 PM
విరాళాల లెక్కింపు వ్యవస్థలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: విరాళాల లెక్కింపు వ్యవస్థలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. టేబుళ్లు, కుర్చీల దగ్గర కాకుండా.. సిబ్బంది నేలపై కూర్చునే విరాళాలను లెక్కించాలని ఆదేశించింది. డ్రెస్ కోడ్‌ను తప్పని సరి చేసింది. సిబ్బంది జేబులు లేని డార్క్ బ్లూ యూనీఫామ్ మాత్రమే ధరించాలని ఆదేశించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విరాళాలు లెక్కించే సిబ్బందిని కౌంటింగ్ హాలులోకి పంపడానికి ముందు రెండు సార్లు సెక్యూరిటీ స్క్రీనింగ్ చేయనున్నారు. విరాళాలు లెక్కించే హాలు 24 గంటల పాటు నిరంతరం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. గతంలో లాగా ఫుటేజ్ డిలీట్ అవ్వకుండా ఉండేలా డేటా స్టోరేజ్ గడువును కూడా పెంచారు. కాగా, ప్రత్యేక విచారణ బృందం (SIT) సూచనల మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది.
ఇవి కూడా చదవండి
భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్..
20 ఏళ్ల రేవంత్ రాజకీయ ప్రస్థానం.. శుభాకాంక్షలు చెప్పిన బండి సంజయ్