Share News

భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్!

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:54 PM

భారత జట్టుకు దూరమైన తర్వాత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా బయట కనిపించాడు. ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటూ మీడియా ప్రతినిధులు అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్!
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. భారత మేనేజ్‌మెంట్ అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించింది. సూర్యను జట్టులో నుంచే తీసేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జట్టుకు దూరమైన తర్వాత సూర్య తొలిసారిగా బయట కనిపించాడు. ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటూ మీడియా ప్రతినిధులు అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


ఆ వీడియో ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు. అక్కడ కొంతమంది ‘ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు’ అని అడగ్గా.. సూర్య తనదైన స్టైల్‌లో నవ్వుతూ స్పందించాడు. ‘అబ్బా.. నన్నా? అలా అయితే నేను లేకపోయినా అంతా బాగానే సాగుతోంది కదా!’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరోక్షంగా భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు కౌంటర్ ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులో నుంచి తప్పించినా.. ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఐర్లాండ్ సిరీస్ ఓటమి అనంతరం.. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వినూత్న షాట్లు, దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మార్చగల సామర్థ్యం ఉన్న సూర్య లేకపోవడం జట్టుపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి:

వింబుల్డన్ 2026: ఫెదరర్ రికార్డును సమం చేసిన జకోవిచ్

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

Updated Date - Jul 04 , 2026 | 05:23 PM