Share News

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:40 PM

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి రికార్డుల వేట కొనసాగుతోంది. కాబో వెర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సి రెండు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి రికార్డుల వేట కొనసాగుతోంది. కాబో వెర్డ్‌పై 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో మెస్సి రెండు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా రికార్డును అధిగమించాడు.


కాబో వెర్డ్‌తో పోరులో మెస్సి గోల్ కొట్టాడు. దీంతో ప్రపంచ కప్ కెరీర్‌లో అతడి మొత్తం అసిస్ట్స్ సంఖ్య 9కి చేరింది. ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక అసిస్ట్స్ చేసిన మారడోనా(8) రికార్డును మెస్సి బద్దలు కొట్టాడు. అలాగే 29వ నిమిషంలో అద్భుత గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందించిన మెస్సి.. వరుసగా ఎనిమిది ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.


ఈ గోల్‌తో మెస్సి ప్రపంచ కప్‌ల్లో మొత్తం గోల్స్ సంఖ్య 20కు చేరుకుంది. అంతేకాదు, రెండు వేర్వేరు ప్రపంచ కప్ టోర్నీల్లో ఏడేసి గోల్స్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా కూడా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో ఏడు గోల్స్ చేసిన మెస్సి.. ప్రస్తుతం జరుగుతున్న 2026 ప్రపంచ కప్‌లోనూ ఇప్పటికే ఏడో గోల్ నమోదు చేశాడు. దీంతో గోల్డెన్ బూట్ రేసులోనూ అతడు అగ్రస్థానంలో నిలిచాడు. కాబో వెర్డ్‌పై విజయంతో అర్జెంటీనా ప్రిక్వార్టర్స్‌‌కు అర్హత సాధించింది. అక్కడ ఈజిప్ట్‌తో తలపడనుంది. అద్భుతంగా పోరాడినప్పటికీ ఓడిన కాబో వెర్డ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ఇవి కూడా చదవండి:

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కేప్ వెర్డెపై అశ్విన్ ప్రశంసలు

వైభవ్ ‘న్యూ చాప్టర్’ పోస్ట్.. రెండో టీ20లో అరంగేట్రం ఖాయం?

Updated Date - Jul 04 , 2026 | 02:38 PM