Share News

మెక్సికోతో మ్యాచ్‌.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు వయాగ్రా వాడేందుకు అనుమతి..

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:05 PM

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు వయాగ్రా వాడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ థామస్ టూచెల్ నుంచి అనుమతి లభించింది.

మెక్సికోతో మ్యాచ్‌.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు వయాగ్రా వాడేందుకు అనుమతి..
England vs Mexico

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు వయాగ్రా వాడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ థామస్ టుచెల్ నుంచి అనుమతి లభించింది. అయితే ఇది లైంగిక సమస్యల కోసం కాదు.. మెక్సికో సిటీలోని ఎత్తైన ప్రాంత పరిస్థితులను ఎదుర్కొనేందుకే ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది (England vs Mexico).


ఇంగ్లండ్-మెక్సికో మ్యాచ్ చారిత్రాత్మక 'ఎస్టాడియో అజ్టెకా' స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం సముద్ర మట్టానికి సుమారు 2,240 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంతటి ఎత్తులో సాధారణంగా గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాతావరణానికి అలవాటు పడలేని ఆటగాళ్లకు త్వరగా అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలతిరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది (Viagra England players).


ఇలాంటి పరిస్థితుల్లో వయాగ్రా కొంత వరకు సహాయపడగలదు. వయాగ్రాలో ఉండే 'సిల్డెనాఫిల్' అనే ఔషధం ఊపిరితిత్తుల రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ వినియోగం కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ ఔషధం ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ (WADA) నిషేధిత జాబితాలో లేదు. దీంతో కొందరు ఆటగాళ్లు వయాగ్రాను ఉపయోగిస్తుంటారు (Mexico City altitude).


ఇంగ్లండ్ ఆటగాళ్లు తప్పనిసరిగా వయాగ్రా వాడతారని ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు (England football). ప్రధాన కోచ్ థామస్ టుచెల్ మెక్సికో సిటీలోని ఎత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రీయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

Updated Date - Jul 04 , 2026 | 12:05 PM