Share News

వైభవ్ ‘న్యూ చాప్టర్’ పోస్ట్.. రెండో టీ20లో అరంగేట్రం ఖాయం?

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:09 PM

వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చకు దారితీసింది. ‘న్యూ చాప్టర్’ అంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ను చూసి.. నేడు ఇంగ్లండ్‌పై డెబ్యూ చేస్తున్నట్లు వైభవ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

వైభవ్ ‘న్యూ చాప్టర్’ పోస్ట్.. రెండో టీ20లో అరంగేట్రం ఖాయం?
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై కొద్దిరోజులుగా చర్చ కొనసాగుతోంది. నేడు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ రెండో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చకు దారితీసింది. ‘న్యూ చాప్టర్’ అంటూ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ను చూసి.. నేడు ఇంగ్లండ్‌పై డెబ్యూ చేస్తున్నట్లు వైభవ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. 15 ఏళ్లకే సీనియర్ జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. ఐర్లాండ్ సిరీస్ ఓటమి, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ రద్దు నేపథ్యంలో.. వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో నేడు జరిగే రెండో టీ20లో వైభవ్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ సమయంలోనూ నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్న వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వైభవ్ ఆడితే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘టోర్నడో’ ఎమోజీతో ‘న్యూ చాప్టర్’ అంటూ వైభవ్ పెట్టిన పోస్ట్ చూసి.. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో వైభవ్ డెబ్యూ ఖాయమంటూ అభిమానులు కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. విధ్వంసం సృష్టించడానికి సిద్ధమని ఆ టోర్నడో ఎమోజీ అర్థం. మరి నేటి మ్యాచ్‌లో వైభవ్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా? అనేది తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి:

ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది: దీప్తి శర్మ

భారత్‌పై విజయం.. మా స్థాయిని పెంచింది: ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

Updated Date - Jul 04 , 2026 | 12:09 PM