Share News

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

ABN , Publish Date - Jul 04 , 2026 | 02:26 PM

ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు.

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. దీంతో రౌండ్ 16కు అర్హత సాధించింది. పసికూన కాబో వెర్డ్‌ అద్భుత ఆటతీరుకు ఫుట్‌బాల్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఆఖరిలో అద్భుతంగా పుంజుకున్న అర్జెంటీనా.. కాబో వెర్డ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు.


‘ఈ మ్యాచ్ కష్టంగా ఉంటుందని అంచనా వేశాం. ఆ ఒత్తిడిని భరించి చివరికి విజయాన్ని సాధించాం. కాబో వెర్డ్‌పై పోరాడాం.. బాధను భరించాం.. చివరికి గెలిచాం. అయితే ఈ టోర్నీలో ఇంకా మా ప్రయాణం కొనసాగుతోంది’ అంటూ మెస్సి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా చివరి వరకూ అద్భుతంగా పోరాడిన కాబో వెర్డ్‌పై మెస్సి ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ప్రపంచ కప్‌లో ఏదీ తేలిగ్గా రాదు. కాబో వెర్డ్‌ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడింది. ఇప్పుడు మాకు కాస్త విరామం దొరికింది. ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. తదుపరి పోరుపై దృష్టి పెడతాం’ అని మెస్సి తెలిపాడు. కాగా ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా.. ఈజిప్ట్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కేప్ వెర్డెపై అశ్విన్ ప్రశంసలు

వైభవ్ ‘న్యూ చాప్టర్’ పోస్ట్.. రెండో టీ20లో అరంగేట్రం ఖాయం?

Updated Date - Jul 04 , 2026 | 02:37 PM