Share News

20 ఏళ్ల రేవంత్ రాజకీయ ప్రస్థానం.. శుభాకాంక్షలు చెప్పిన బండి సంజయ్

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:45 PM

ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

20 ఏళ్ల రేవంత్ రాజకీయ ప్రస్థానం.. శుభాకాంక్షలు చెప్పిన బండి సంజయ్
Union Minister Bandi Sanjay

హైదరాబాద్, జులై 4: ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడా కష్టపడి పైకొచ్చినవారే అని అన్నారు. సీఎం రేవంత్‌ 6 గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. SIR పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.


హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి విమర్శించారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందన్నారు. మజ్లిస్‌తో కుమ్మక్కై హిందువుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 04:47 PM