Congress: పాకిస్థాన్ కన్నా దారుణంగా భారత్.. మోదీపై రాహుల్ ఫైర్
ABN, Publish Date - Mar 03 , 2024 | 03:38 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దేశంలో నిరుద్యోగితకు కారణం మోదీ ప్రభుత్వం అవలంభించిన విధానాలేనని దుయ్యబట్టారు.
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దేశంలో నిరుద్యోగితకు కారణం మోదీ ప్రభుత్వం అవలంభించిన విధానాలేనని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ కన్నా భారతదేశం వెనకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతోన్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. పాకిస్థాన్ కన్నా భారతదేశంలో నిరుద్యోగం రెట్టింపుగా ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్ కన్నా దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారని రాహుల్ గాంధీ వివరించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తీసుకురావడంతో చిరు వ్యాపారులు కనుమరుగు అయ్యారని మండిపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 03 , 2024 | 03:38 PM