ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: గాంధీపై వ్యాఖ్యల దుమారం.. ప్రగ్యా ఠాకూర్‌కు నో టికెట్.. ఏమన్నారంటే..?

ABN, Publish Date - Mar 04 , 2024 | 08:44 AM

భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్‌లో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు టికెట్ ఇవ్వలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పింది. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధ పడ్డారు.

భోపాల్: భారతీయ జనతా పార్టీ (BJP) ఫస్ట్ లిస్ట్‌లో కొందరు సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు ( Pragya Thakur) టికెట్ రాలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పారు. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ (PM Modi) బాధ పడ్డారు. ప్రగ్యా ఠాకూర్ సారీ చెప్పిన ఆమెను క్షమించలేదు. అందుకే టికెట్ రాలేదని ప్రగ్యా ఠాకూర్ వివరించారు.

కావాలని అడగలేదే..?

‘ఇంతకు ముందు టికెట్ ఇవ్వాలని కోరలేదు, ఇప్పుడు టికెట్ అడగలేదు. గతంలో గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధపడ్డారు. తనను క్షమించబోనని ఆ సమయంలోనే ప్రకటించారు. ఆ వ్యాఖ్యల తర్వాత మోదీకి సారీ చెప్పాను అని’ ప్రగ్యా ఠాకూర్ స్పష్టం చేశారు. 2019 మే నెలలో ప్రగ్యా ఠాకూర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. గాంధీని చంపి నాథురాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అని అన్నారు. ఆ వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. ‘గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడా..? జాతి పిత గాంధీని ప్రగ్యా ఠాకూర్ అవమానించారు. ప్రగ్యా ఠాకూర్‌ను క్షమించబోను అని’ మోదీ స్పష్టం చేశారు.

33 మందికి నో

195 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సర్వే, వ్యక్తిగత ఇమేజ్, కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన వారికి టికెట్ ఇవ్వలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ స్థానంలో మాజీ మేయర్ అలోశ్ శర్మకు టికెట్ కేటాయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 08:59 AM

Advertising
Advertising