Hero Vijay: రాజకీయ పార్టీగా ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కం’.. అధ్యక్షుడిగా విజయ్!
ABN, First Publish Date - 2024-01-28T12:33:34+05:30
తమిళ హీరో విజయ్(Tamil hero Vijay) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు వున్న విజయ్ మక్కల్ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే ఆయన రాజకీయ పార్టీగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్యారీస్(చెన్నై): తమిళ హీరో విజయ్(Tamil hero Vijay) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు వున్న విజయ్ మక్కల్ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే ఆయన రాజకీయ పార్టీగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీ గుర్తింపునకు కేంద్ర ఎన్నికల సంఘం కోసం దరఖాస్తు చేయనున్నట్టు సమాచారం. గురువారం స్థానిక పనైయూరులో విజయ్ మక్కల్ ఇయ్యక్కం ప్రధాన కార్యాలయంలో ముఖ్య నిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఇంకా పేరు పెట్టని రాజకీయ పార్టీకి విజయ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ ఇయ్యక్కం పోటీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ తన అభిమాన సంఘాన్ని మక్కల్ ఇయ్యక్కంగా మార్చి పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
Updated Date - 2024-01-28T12:33:36+05:30 IST