ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Varun Gandhi: వరుణ్ గాంధీకి మొండి చేయి.. మేనకా గాంధీకి అగ్రతాంబూలం..

ABN, Publish Date - Mar 26 , 2024 | 11:14 AM

మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections - 2024 ) కోసం అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో పాటు కొత్త వారు సైతం ఉన్నారు.

మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections - 2024 ) కోసం అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో పాటు కొత్త వారు సైతం ఉన్నారు. ఏడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం కానున్నాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. ఈ జాబితాలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సీతా సోరెన్ దుమ్కా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ, కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, బిశ్వేశ్వర్ తుడు వంటి ముఖ్య నేతలకు బీజేపీ స్థానం కేటాయించకపోవడం గమనార్హం.

పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసేందుకు వరుణ్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానం తలొగ్గలేదు. ఆయన స్థానంలో మాజీ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద్ ను నియమించింది. అయితే వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్ నుంచి కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లో మొదటి దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం మార్చి 20నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది.

Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..

గత కొన్నేళ్లుగా వరుణ్ గాంధీ చేస్తున్న చర్యల వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీ ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా.. లేక ఎస్పీతో జట్టు కడతారా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 11:14 AM

Advertising
Advertising