ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bird flu: బర్డ్‌ఫ్లూ నిరోధానికి 12 చోట్ల తనిఖీ కేంద్రాలు

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:35 AM

కేరళలో బర్డ్‌ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

చెన్నై: కేరళలో బర్డ్‌ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేరళలోని ఆళపుళా జిల్లాలో ఓ బాతుల పెంపకం కేంద్రంలో సోకిన బర్డ్‌ ఫ్లూ కారణంగా ఒకే సమయంలో వెయ్యికి పైగా బాతులు మరణించాయి.. దీంతో ఆ ప్రాంతానికి కిలోమీటర్‌ చుట్టూ పెంచుతున్న కోళ్ళు, బాతులను, కాడై పక్షులను నాశనం చేయడానికి వెటర్నరీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ పరిస్థితులలో కేరళ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్ర సరిహద్దుల్లో ప్రభుత్వం నిఘా ఏర్పాటుచేసింది. ఆ మేరకు తెన్‌కాశి జిల్లా పులియరై చెక్‌పోస్ట్‌ వద్ద వెటర్నరీ అధికారులు కేరళ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Bihar: బిహారీలు జైకొట్టేదెవరికి? ఎన్డీయేను మళ్లీ ఆదరిస్తారా.. ఇండియా కూటమిని నిలబెడతారా

ఇదే విధంగా కోయంబత్తూరు, నీలగిరి, కన్నియాకుమారి జిల్లా సరిహద్దులలోనూ కేరళ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కేరళకు చేరువుగా ఉన్న రాష్ట్ర సరిహద్దుల్లో 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కేరళ(Kerala) నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కేరళ నుంచి లారీలలో వచ్చే కోళ్లు, బాతులు, కోడిగుడ్లను తిప్పిపంపుతున్నారు. కేరళ నుండి కాయగూరల లోడుతో వచ్చే వాహనాలను కూడా రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. కేరళ మీదుగా వచ్చే లారీలు, ట్రక్కులపై వెటర్నరీ అధికారులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. కేరళకు ఫారమ్‌ కోళ్లను తీసుకెళ్ళి తిరిగొచ్చే లారీలను, వ్యాన్‌లపై కూడా క్రిమి సంహారక మందులు చల్లుతున్నారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద వెటర్నరీ విభాగానికి చెందిన నలుగురు అధికారులు, సూపర్‌వైజర్లు షిఫ్ట్‌పద్ధతిలో డ్యూటీ చేస్తున్నారు. కేరళ నుండి వచ్చే ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన మీదటే వాటిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Eyes: వేసవిలో మీ నేత్రాలను ఇలా సంరక్షించుకోండి...

Read Latest National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 11:35 AM

Advertising
Advertising