ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: శివునిపై అనుచిత వ్యాఖ్యలు.. కోర్టు కీలక నిర్ణయం..

ABN, Publish Date - Apr 19 , 2024 | 05:03 PM

హిందుపులు పూజించే ప్రధాన దేవుళ్లల్లో ఒకరైన శివునిపై అవమానకర వ్యాఖ్యల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

హిందుపులు పూజించే ప్రధాన దేవుళ్లల్లో ఒకరైన శివునిపై అవమానకర వ్యాఖ్యల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. మతాన్ని కించపరిచే చర్య ఉద్దేశపూర్వకంగా జరిగిందని హైకోర్టు పేర్కొంది. అంతే కాకుండా క్రిమినల్ కేసును రద్దు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా శివలింగాన్ని అవమానపరిచే చిత్రాన్ని పోస్ట్ చేయడం వల్ల మతపరమైన మనోభావాలను కించపరిచాలనే దురుద్దేశం దాగి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను వ్యక్తిగతంగా పరిగణించలేమని, మత దూషణ చర్యలు ఒక మతానికి సంబంధించినవిగా ఉంటాయని వెల్లడించింది.


Crime News: కాలేజీలో దారుణం.. ప్రేమించలేదనే అక్కసుతో అందరూ చూస్తుండగా ప్రియురాలిపై..

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. ప్రతి ఒక్కరూ నిగ్రహంగా ఉండాలి. మతం పేరుతో సమాజానికి హాని కలిగించే చర్యలకు దూరంగా ఉండాలి. మతపరమైన మనోభావాలను నిర్మొహమాటంగా విస్మరించే ఈ చర్యలను ఉపేక్షించలేం.

- అలహాబాద్ హైకోర్టు


Elections 2024: ప్రశాంతంగా పోలింగ్.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంత నమోదైందంటే..

రోడ్డుపై ఉన్న డివైడర్‌ను శివలింగంగా భావించి అపహాస్యం చేశారని పిటిషన్ దారుడు వ్యాజ్యం దాఖలు చేశారు. అంతే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పదాలు కూడా రాశారని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత సెప్టెంబర్ 2, 2022న ఛార్జ్ షీట్ దాఖలైంది. ట్రయల్ కోర్టు విచారణను స్వీకరించింది. జనవరి 13, 2023న సమన్లు జారీ చేసింది. ఛార్జ్ షీట్, సమన్ల ఉత్తర్వులు, కేసును రద్దు చేయాలని కోరుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు నిందితులుక ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 05:03 PM

Advertising
Advertising