Share News

Elections 2024: ప్రశాంతంగా పోలింగ్.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంత నమోదైందంటే..

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:08 PM

దేశ వ్యాప్తంగా మొదటి విడత లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బెంగాల్ లో మాత్రం అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇవాళ తొలి దశ జరుగుతోంది.

Elections 2024: ప్రశాంతంగా పోలింగ్.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంత నమోదైందంటే..

దేశవ్యాప్తంగా మొదటి విడత లోక్ సభ ఎన్నికలు ( Lok Sabha Elections ) ప్రశాంతంగా జరుగుతున్నాయి. బెంగాల్ లో మాత్రం అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇవాళ తొలి దశ జరుగుతోంది. ఎన్నికల క్రతువు పూర్తయ్యాక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దేశంలోని 543 లోక్ సభ సభ్యులను ఎన్నుకునేందుకు దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. మూడోసారీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టి తీరాలని బీజేపీ భావిస్తుండగా.. ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఇండియా కూటమి పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన ఎన్నికల శాతాన్ని అధికారులు ప్రకటించారు.

 • అండమాన్ నికోబార్ దీవులు - 45.48 శాతం

 • అరుణాచల్ ప్రదేశ్ 54.79 శాతం

 • అస్సాంలో 60.70 శాతం

 • బీహార్ 39.73 శాతం

 • ఛత్తీస్‌గఢ్‌లో 58.14 శాతం

 • జమ్మూ కశ్మీర్‌లో 57.09 శాతం

 • లక్షద్వీప్‌లో 43.98 శాతం

 • మధ్యప్రదేశ్‌లో 53.40 శాతం

 • మహారాష్ట్రలో 44.12 శాతం

 • మణిపుర్‌లో 63.03 శాతం

 • మేఘాలయలో 61.95 శాతం

 • మిజోరంలో 49.14 శాతం

 • నాగాలాండ్‌లో 51.73 శాతం

 • పుదుచ్చేరిలో 58.86 శాతం

 • రాజస్థాన్‌లో 41.51 శాతం

 • సిక్కింలో 52.72 శాతం

 • తమిళనాడులో 50.04 శాతం

 • త్రిపురలో 68.33 శాతం

 • ఉత్తరప్రదేశ్‌లో 47.44 శాతం

 • ఉత్తరాఖండ్‌లో 45.62 శాతం

 • పశ్చిమ బెంగాల్‌లో 66.34 శాతం

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 04:10 PM