ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: తూచ్, నా ఉద్దేశం అది కాదు.. ఈటలతో కామెంట్లపై మల్లారెడ్డి

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:21 PM

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో మల్లారెడ్డి స్పందించక తప్పలేదు. అసలు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. తాను ఏదో సరదాకి అన్నానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.

Malla Reddy

హైదరాబాద్: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీమంత్రి మల్లారెడ్డి (Malla Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో మల్లారెడ్డి స్పందించక తప్పలేదు. అసలు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. తాను ఏదో సరదాకి అన్నానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.

Loksabha Polls: అన్నా.. నువ్వే గెలుస్తావ్.. ఈటల రాజేందర్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి


మల్లారెడ్డి ఏం చెప్పారంటే..?

‘నిన్న మధ్యాహ్నం పెళ్లికి వెళ్లాం.. అక్కడ తన పాత మిత్రుడు ఈటల రాజేందర్ కలిశారు. తనతో కలిసి ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేశారు. (మీడియా ప్రతినిధులతో) ఉదహరణకు నీ బర్త్ డే ఉంది. ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్ డే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పమా..? నువ్వు నా లాగే ఎమ్మెల్యే, ఎంపీ కావాలని అని ఆశీర్వదించమా..? నేను కూడా నిన్న అలాగే ఈటల రాజేందర్‌‌తో అన్న. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందా..? అని రిపోర్టర్లు ప్రశ్నించగా అందుకు మల్లారెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పోలింగ్ జరిగే రోజు బోడుప్పల్‌లో వజ్రేష్ యాదవ్ తనకు ఎదురు పడ్డాడు. నువ్వే గెలుస్తున్నావ్ అని ఆయనతో అన్న. ఆయన గెలిచిండ.. అప్పుడు కూడా రికార్డయ్యింది. ఆ వీడియోను వైరల్ చేసుకున్నాడు. నిన్న వైరల్ అయినట్టు వైరల్ చేసుకున్నాడని మల్లారెడ్డి వివరించారు. వాళ్లంతా మోసగాళ్లు.. వీడియో రాగానే వైరల్ చేస్తారు. స్టేటస్ పెట్టుకుంటారు. మనిషి మంచి కావాలి, గుణం మంచి కావాలి, పనిచేసే లీడర్ కావాలా..? మల్లన్న లాగా అని’ మల్లారెడ్డి స్పష్టం చేశారు.

Loksabha Polls: అన్నా.. నువ్వే గెలుస్తావ్.. ఈటల రాజేందర్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 04:22 PM

Advertising
Advertising