ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG ELECTIONS: ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం చర్యలు

ABN, Publish Date - Apr 20 , 2024 | 07:39 PM

నగరంలోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం (Election Commission) ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

CEO Vikas Raj

హైదరాబాద్: నగరంలోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం (Election Commission) ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ ఫొటో ఎగ్జిబిషన్ కొనసాగనున్నది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ... ఓటర్లు ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని చెప్పారు.


TG Politics: నన్ను టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పోలింగ్ సెంటర్‌ చెక్ చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల ద్వారా ఏదో ఒకటి ఎన్నికల నిర్వాహకులకు చూయించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటు హక్కు మన బాధ్యత అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మనల్ని ఎవరు పాలించాలో మనమే ఎన్నుకోవాలని అన్నారు. మీ ప్రాంతాన్ని ఎవరు అద్భుతంగా అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని.. తప్పకుండా ఓటు మాత్రం వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు రద్దీ ఉన్న ప్రదేశాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు.

Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు


ఓటింగ్ శాతం పెరగాలి: ఎండీ సజ్జనార్

ప్రజలకు ఓటర్ అవగాహన పెంచేందుకు సీఈఓ వికాస్ రాజ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్‌లో ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

రోజు ఎంజీబీఎస్ బస్టాండ్‌ నుంచి లక్ష మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని వివరించారు. ఓటింగ్ శాతం పెరిగేలా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. యువత ముందుకు రావాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి

Etela Rajender: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదు..

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

Updated Date - Apr 20 , 2024 | 07:51 PM

Advertising
Advertising