ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jio Cinema: జియో సూపర్ ఆఫర్.. జస్ట్ రూ. 29 కే నెల మొత్తం..

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:46 PM

Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్‌లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..

Jio Premium Plans

Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్‌లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు.. సరికొత్త ఆఫర్ ప్రకటించింది. అత్యంత తక్కువ ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రకటించింది. వీడియో క్వాలిటీ పెంచడం, యాడ్స్ లేకుండా ఉండటం ఈ ప్లాన్స్ ప్రత్యేకత. మరి ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి? వాటి ధర ఎంత? ఆ ప్లాన్స్‌లోని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.


రూ. 29తో రీచార్జ్ చేసుకుంటే..

జియో సినిమా కొత్తగా రూ. 29 తో ప్లాన్ ప్రకటించింది. నెలకు రూ. 29 చెల్లిస్తే చాలు.. ఎలాంటి యాడ్స్ లేకుండా.. 4కే క్వాలిటీతో వీడియో కంటెంట్‌ను చూడొచ్చు. ఈ వీడియోను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ వీక్షించే సదుపాయం ఉంది. జియో సినిమాలో వచ్చే ప్రతి కంటెంట్‌ను స్మార్ట్ మొబైల్, టీవీ సహా ఎందులోనైనా చూడొచ్చు. అయితే, ఇక్కడ ఒక కండీషన్ ఉంది. రూ. 29 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే.. ఒక సమయంలో ఒకే డివైజ్‌లో మాత్రమే వీక్షించే అవకాశం ఉంది.


రూ.89తో రీచార్జ్ చేసుకుంటే..

ఇది ఫ్యామిలీ ప్లాన్. కుటుంబాలను ఆకర్షించేందుకు గానూ జియో సినిమా రూ. 89 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఒకసారి రీచార్జ్ చేస్తే నెల రోజుల పాటు నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను చూడొచ్చు. ఈ ప్లాన్‌లో కూడా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని.. ఆఫ్‌లైన్‌లో చూడొచ్చు. అలాగే జియో సినిమాలోని వచ్చే అన్ని రకాల కంటెంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో చూసుకునే వెసులుబాటు ఉంది. యాడ్ లేకుండా, 4కే క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. అంతేకాదు.. ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా యాడ్ లేకుండా చూడొచ్చు. కాగా, ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నవారు.. ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారని జియో కంపెనీ తెలిపింది.

For More Business News and Telugu News..

Updated Date - Apr 25 , 2024 | 12:46 PM

Advertising
Advertising