Home » Reliance Jio
రిలయన్స్ జియో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం వేదికగా AI రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను ఆకాశ్ అంబానీ ప్రకటించారు.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా నిలవబోతున్న 'రిలయన్స్ జియో ఐపీఓ' త్వరలో రాబోతోంది. ఈ మెగా ఇష్యూకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు ఆమోదించింది. ఈ పత్రాలను ఈరోజే 'సెబీ'కి సమర్పించారు.
దేశంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన 48వ వార్షిక సాధారణ సమావేశాన్ని (AGM) ఆగస్టు 29న నిర్వహించబోతోంది. దీనిపై ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అంబానీ నేతృత్వంలోని సంస్థ ఈసారి పలు రంగాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఉచిత డాటా, కాలింగ్ సర్వీసులు అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి. సహాయక చర్యల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024–25లో రూ.10.71 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది.జియో, రిటైల్, జియోస్టార్ లాభాలు వృద్ధి చెందగా, ఓ2సీ విభాగం మాత్రం తక్కువ వృద్ధిని చూపింది
రిలయన్స్ జియో ఇటీవలే రూ.1,958కు 365 రోజులపాటు, రూ.458కు 84 రోజుల చెల్లుబాటుతో వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. ఆ తర్వాత కంపెనీ వాటిని ధరలను తగ్గిస్తూ సవరణ చేసింది.
Jio Coin On Polygon Network: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత కరెన్సీ జియో కాయిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జస్ట్ బ్రౌజింగ్‌తో ఫుల్ మనీ సంపాదించే అవకాశాన్ని వినియోగదారులకు ఆయన కల్పిస్తున్నారు.
టెలికం కంపెనీలన్ని మూడు నెలలక్రితం టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన తర్వాత చాలా మంది సామాన్యులు రీఛార్జ్ చేపించు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల యూజర్లే కాకుండా ఫీచర్ ఫోన్ల కస్టమర్లు కూడా ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జియో ఒక ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
బిజినెస్ పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న సంస్థ రిలయన్స్. దీపావళి వేళ.. ఆ సంస్థ ఉద్యోగులకు గిఫ్ట్‌లు బహుమతిగా అందజేసింది. అయితే గిఫ్ట్ ప్యాకెట్లలో ఏముందో చూపిస్తూ.. ఓ యువతి వీడియోలో వివరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. దీంతో నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.