Share News

Reliance AGM 2025: ఆగస్టు 29న అంబానీ ప్రకటనలు ఇవేనా.. లక్షల మంది ఇన్వెస్టర్ల ఆసక్తి..

ABN , Publish Date - Aug 28 , 2025 | 09:51 PM

దేశంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన 48వ వార్షిక సాధారణ సమావేశాన్ని (AGM) ఆగస్టు 29న నిర్వహించబోతోంది. దీనిపై ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అంబానీ నేతృత్వంలోని సంస్థ ఈసారి పలు రంగాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Reliance AGM 2025: ఆగస్టు 29న అంబానీ ప్రకటనలు ఇవేనా.. లక్షల మంది ఇన్వెస్టర్ల ఆసక్తి..
Reliance AGM 2025

దేశంలో ప్రముఖ బిజినెస్ గ్రూప్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సాధారణ సమావేశం (Reliance AGM 2025) ఆగస్టు 29న జరగనుంది. ఈసారి AGMలో కొన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉండటంతో అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. రిలయన్స్ AGM 2025 ఆగస్టు 29, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో ప్రారంభం కానుంది. ఇది పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. దాదాపు 44 లక్షల మంది షేర్‌హోల్డర్లు ఈ ఈవెంట్‌ను వర్చువల్ విధానంలో ఫాలో కానున్నట్లు తెలుస్తోంది.


ఈసారి అంబానీ ఏం చెబుతారు?

Jio IPOపై క్లారిటీ?

ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మార్కెట్‌లో చర్చలు జరుగుతున్న Reliance Jio IPOపై ఈసారి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముకేష్ అంబానీ Jioని స్టాక్ మార్కెట్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారని చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ AGMలో ఎలాంటి టైమ్‌లైన్ ప్రకటించినా, అది షేర్‌హోల్డర్లకు మంచి విలువను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

AI, రిటైల్, FMCG విభాగాలపై అప్డేట్స్

ఇతర ప్రధాన అంశాలలో Reliance ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిటైల్, FMCG విస్తరణ ప్రణాళికలు ఉంటాయి. ఇటీవల ఈ విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ సిగ్నల్స్ ఇచ్చింది.


AGMలో ఎలా పాల్గొనాలి?

  • షేర్‌హోల్డర్లు ఈ AGMలో పాల్గొనాలంటే ఈ లింక్‌ను ఉపయోగించాలి

  • https://jioevents.jio.com/rilagm

లాగిన్ చేయాలంటే:

  • మీ DP ID – Client ID / Folio No

  • AGM నోటీసుతో వచ్చిన పాస్‌వర్డ్ అవసరం.

  • Live గా AGM చూడాలంటే నేరుగా ఈ లింక్‌ను ఉపయోగించండి:

  • https://jioevents.jio.com/meetingportal/rilagm/joinmeeting


FY26 Q1 ఫలితాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల విడుదల చేసిన Q1 FY26 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. కంపెనీ రూ. 26,994 కోట్ల నికర లాభం (PAT) నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 17,448 కోట్లు మాత్రమే ఉండేది. ఆపరేషనల్ రెవెన్యూ రూ.2,48,660 కోట్లుగా నమోదైంది. ఇది FY25 Q1లో నమోదైన రూ.2,36,217 కోట్లతో పోలిస్తే 5.3% పెరుగుదల.

RIL షేర్ ధర

ఆగస్టు 27న NSEలో రిలయన్స్ షేర్లు రూ. 1,390.90 వద్ద ముగిశాయి. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 0.43% పెరుగుదల. AGM ముందు ఇన్వెస్టర్లు కొంతంత హుషారుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 09:52 PM