GST Impact Bikes: బైక్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న ప్రీమియం బైక్‌ల ధరలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:52 PM
బైక్ లవర్స్‌కి కీలక అప్‌డేట్ వచ్చింది. ఎందుకంటే రానున్న రోజుల్లో బైక్ ధరల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఒకవేళ మీరు 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రీమియం బైక్‌లను కొనుగోలు చేయాలని చూస్తే మాత్రం మీకు షాక్ తప్పదు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బైక్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే బైక్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీ (GST) వ్యవస్థను మార్చాలనే యోచనలో ఉంది. దీనివల్ల 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు భారీగా పెరిగే అవకాశం (GST impact on bikes) ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో చిన్న బైకులు, స్కూటర్లకు ఊరట లభించనుంది.
ప్రధానంగా వీటిపై..
ప్రస్తుతానికి అన్ని బైకులపై 28% GST విధిస్తున్నారు. కానీ, 350సీసీ పైబడిన బైకులపై అదనంగా 3% సెస్ ఉంటుంది. అంటే మొత్తం 31% పన్ను పడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం రూపొందిస్తున్న GST 2.0 రిఫార్మ్స్‌లో ఈ శ్లాబ్ రేట్లను మార్చాలనుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 18%, విలాసవంతమైన బైకులు, కార్లు మొదలైన వాటిపై 40% ట్యాక్స్ పడనుంది. కానీ చిన్న స్కూటర్లకు 28% నుంచి 18%కి పన్ను తగ్గడం వల్ల, వీటి ధరలు తగ్గే అవకాశముంది.
ఉదాహరణకు:
Vitpilen 250 సీసీ ప్రస్తుతం ధర రూ.2.19 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంటే. కొత్త జీఎస్టీ ప్రకారం ఇది సుమారు రూ.2.01 లక్షలకు తగ్గే అవకాశముంది.
పెద్ద బైకులు కొనాలని అనుకుంటున్నవారికి
ఇంజిన్ సామర్థ్యం 350సీసీ కన్నా ఎక్కువ ఉన్న బైకులు ఇప్పుడు లగ్జరీ కేటగిరీలోకి వస్తాయి. వీటిపై 40% జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన ఉంది. ఇది అమల్లోకి వస్తే ధరలు మరింత పెరిగిపోతాయి.
ఉదాహరణకు: Svartpilen 401 (373cc) – ప్రస్తుత ధర రూ.2.92 లక్షలు. కొత్త జీఎస్టీ అమలైతే రూ.3.20 లక్షలకు పెరగవచ్చు.
ఎవరి మీద ఎలాంటి ప్రభావం
లాభపడే బ్రాండ్లు:
Royal Enfield, Honda, Jawa-Yezdi వీరి చాలా మోడల్స్ 334cc – 349cc మధ్య ఉంటాయి. ఇవి 18% ట్యాక్స్ కిందకి వస్తాయి.
ధర పెరిగే మోడల్స్:
Royal Enfield Himalayan 450, Interceptor 650
KTM RC 390, Duke 390, Bajaj Pulsar NS400Z (373cc)
Triumph, Harley-Davidson, Kawasaki ఈ బైకులు ఎక్కువగా 350cc కంటే ఎక్కువగా ఉన్నాయి.
కొనుగోలుదారులపై ప్రభావం?
ఈ జీఎస్టీ మార్పులు వల్ల, పెద్ద ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులు కొనే వారు పెద్ద మొత్తంలో అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం 350cc+ బైక్ అమ్మకాలు ప్రతి నెలా 13,000 యూనిట్ల వరకు ఉన్నాయి (మొత్తం 16 లక్షల అమ్మకాల్లో 0.8% మాత్రమే). ధరలు పెరిగితే ఇవి మరింత తగ్గే అవకాశం ఉంది.
ఇప్పుడు కొనాలా లేక ఆగాలా?
ఇంకా ఈ కొత్త జీఎస్టీ మార్పులు అమలులోకి రాలేదు. సెప్టెంబర్‌లో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పెద్ద బైక్ కొనాలనుకుంటున్నవారు ఇప్పుడు కొనడం ఉత్తమం. ఎందుకంటే కొత్త పన్ను అమలైతే ధరలు మరింత పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి