ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kutami: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు చంద్రబాబు, పవన్ ప్రచారం..

ABN, Publish Date - Apr 10 , 2024 | 09:00 AM

ప.గో. జిల్లా: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్ధరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు..

ప.గో. జిల్లా: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు (Tanuku), నిడదవోలు (Nidadavolu)లలో జరిగే బహిరంగ సభలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababy), జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్ధరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు.. తణుకు నరేంద్ర సెంటర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు, నిడదవోలులో రాత్రి ఏడు గంటలకు బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇద్దరు నేతలు నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకోనున్నారు. కాగా సభ అనంతరం చంద్రబాబు, పవన్ ఇద్దరు నేతలు రోడ్డు మార్గాన నిడదవోలు చేరుకోనున్నారు. సభ తరువాత చంద్రబాబు నాయుడు నిడదవోలులోనే రాత్రి బస చేస్తారు. కాగా నిడదవోలులో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి యంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది.

కాగా టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) ప్రజాగళం (Prajagalam) బహిరంగ సభకు తణుకు ముస్తాబు అయింది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారు. వీరిద్దరూ వేర్వేరు హెలీ కాఫ్టర్లలో బుధవారం సాయంత్రం మూడున్నర గంటలకు తణుకు పాలిటెక్నిక్‌ కళాశాలలో ల్యాండ్‌ కానున్నారు. ఈ మేరకు ఇక్కడ హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. వీరిద్దరూ కలిసి ఇక్కడి నుంచి పట్టణంలోని నరేంద్ర సెంటర్‌ వరకు రోడ్‌ షో నిర్వహిస్తారు. నాలుగు గంటలకు సభ మొదలై ఐదున్నర గంటలకు ముగుస్తుంది. అనంతరం రోడ్డు మార్గంలోనే నిడదవోలుకు చేరుకుని రాత్రి ఏడు గంటలకు జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సభలో కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా పాల్గొంటారు. సభ పూర్తయిన తర్వాత చంద్రబాబు నిడదవోలు తిరుమల సాయి కల్యాణ మండపంలో బస చేస్తారు. పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం షెల్టాన్‌ హోటల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో నిడదవోలులో సమీక్ష జరిపి ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తారు. తణుకులో జరిగే ప్రజాగళం సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లను తణుకు మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు.

Updated Date - Apr 10 , 2024 | 09:00 AM

Advertising
Advertising