AP Politics: కృష్ణా జిల్లాలో 10 మంది టీడీపీ-జనసేన అభ్యర్థులు ఖరారు
ABN, First Publish Date - 2024-02-11T07:54:23+05:30
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు ఖరారు చేశారు. 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Janasena) అభ్యర్థులు ఖరారు చేశారు. 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గుడివాడ, పామర్రులో మాత్రం కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. మచిలీపట్నం, నందిగామతో సహా ఐదు స్థానాల్లో పాతవరికే మరో అవకాశం ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. మైలవరం, పెనమలూరు నియోజకవర్గాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అభ్యర్థులు వీరే
మచిలీపట్నం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర బరిలోకి దిగుతారు. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఇచ్చారు. పామర్రు నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేస్తారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వర రావు పోటీ చేస్తారు. నందిగామ నుంచి టీడీపీ మహిళా నేత తంగిరాల సౌమ్య, జగ్గయ్య పేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్థికి ఖరారు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - 2024-02-11T08:01:29+05:30 IST