ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదు!

ABN, Publish Date - Mar 12 , 2024 | 07:31 PM

రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.

అమరావతి: రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడన్నారు. గత ఎన్నికల్లో బంధుత్వాలతో సంకెళ్లు వేశారన్నారు. ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని చెప్పారు. 175 సీట్లలో టీడీపీ - బీజేపీ - జనసేన పోటీ చేస్తాయన్నారు. అక్రమంగా అధికారం ఒక్కరి దగ్గర చేరితే బతకలేమన్నారు. భీమవరంలో కొమ్ములు తిరిగిన వాళ్లున్నారని.. అయినా ఒక్క జగన్‌కు భయపడుతున్నారన్నారు. పార్టీ పెట్టడానికి తాను సొంత అన్న(చిరంజీవి)ని కాదని బయటకువచ్చానని తెలిపారు. ఆయనను ఇబ్బంది పెట్టానని చెప్పారు. తాను నిర్ణయం తీసుకునే ముందు లక్ష ఆలోచిస్తానని పవన్‌ కళ్యాణ్ వివరించారు.

ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్‌కి పవన్ వార్నింగ్

జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు. భీమవరంలో రౌడీయిజం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గొడవలకు సై అంటే దానికి రెండింతలు సై అంటానని సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్‌పై పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఎమ్మెల్యే దౌర్జన్యాల వల్ల ఆఫీసు ఇవ్వడానికి కూడా చాలా మంది భయపడ్డారని అన్నారు. తనకే స్థలం ఇవ్వడానికి భయపడుతున్నారంటే.. అక్కడ రౌడీయిజం ఎలా ఉందో అర్థం అవుతోందన్నారు. భీమవరం కుబేర నగరం.. కానీ వైసీపీ నేతలు రౌడీ నగరంగా మార్చారని ధ్వజమెత్తారు. తన బంధువులు, కులపోళ్లు ఉన్నా.. మూర్ఖుడి మాటలే నమ్మారని చెప్పారు. భీమవరం నుంచి గంధి శ్రీనివాస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జనసేన ఆఫీసు కోసం స్థలం చూపిస్తే సొంత డబ్బుతో కొంటానని తెలిపారు. ఏపీలో జగన్ పాలన పోవాలని.. భీమవరంలో గంధి శ్రీనివాస్‌ను ఓడించాలని పవన్‌ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 07:40 PM

Advertising
Advertising