Minister Kolusu Parthasarathy : లక్ష ఇళ్లకు త్వరలో ప్రారంభోత్సవాలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 04:16 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
మంత్రి పార్థసారథి
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వీటిని త్వరలోనే ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో ఒక జిల్లాలో పాల్గొంటారని, మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందిస్తారని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో పేదల ఇళ్ల నిర్మాణంపై మంత్రి సమీక్షించారు.
Updated Date - Dec 31 , 2024 | 04:17 AM