MLA Parthasarathy: ఈనెల 11న చంద్రబాబుని కలవనున్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి...!
ABN, Publish Date - Jan 11 , 2024 | 08:06 PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) ని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ( MLA Parthasarathy ) ఈనెల 11వ తేదీన కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో పార్థసారథి కలవనున్నారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) ని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ( MLA Parthasarathy ) ఈనెల 11వ తేదీన కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో పార్థసారథి కలవనున్నారు. పెనమలూరు లేదా నూజివీడు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో టీడీపీలో పార్థసారథి చేరిక అంశం రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును పార్థసారథి కలిశారు. ఇటీవల బహిరంగంగానే జగన్ , వైసీపీ పార్టీపై తీవ్ర అసంతృప్తిని పార్థసారథి వ్యక్తం చేశారు.
Updated Date - Jan 11 , 2024 | 08:06 PM