ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: అయినా భరిస్తున్నాడు.. త్రివిక్రమ్‌పై పవన్ కల్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Mar 14 , 2024 | 03:26 PM

టాలీవుడ్ డైరెక్టర్, తన స్నేహితుడు త్రివిక్రమ్‌ గురించి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని(Mangalagiri) జనసేన సెంట్రల్ ఆఫీస్‌లో మాట్లాడిన పవన్.. రానున్న ఎన్నికల్లో జగన్‌ను(Jagan) ఓడించడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపొందాల్సిన అవశ్యకతను వివరించారు. ఇదే సమయంలో త్రివిక్రమ్(Trivikram Srinivas) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కల్యాణ్.

AP Politics

అమరావతి, మార్చి 14: టాలీవుడ్ డైరెక్టర్, తన స్నేహితుడు త్రివిక్రమ్‌ గురించి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని(Mangalagiri) జనసేన సెంట్రల్ ఆఫీస్‌లో మాట్లాడిన పవన్.. రానున్న ఎన్నికల్లో జగన్‌ను(Jagan) ఓడించడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపొందాల్సిన అవశ్యకతను వివరించారు. ఇదే సమయంలో త్రివిక్రమ్(Trivikram Srinivas) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కల్యాణ్. 2019లో 30 స్థానాల్లో పోటీ చేద్దామనుకుంటే.. తనపై కొందరు ఒత్తిడి తెచ్చారని అన్నారు. గాజువాకలో తాను కూడా ఓడిపోతున్నట్లుగా ముందే తెలిసిందన్నారు. ఇక భీమవరంలో కూడా ప్రచారం ముగించగానే ఓటమి తప్పదని అర్థమైందన్నారు. కానీ, దేవుడు ఆజ్ఞ మేరకు ముందుకు కదిలానన్నారు. ‘కర్మ యోగివి.. బాధ్యతలు నిర్వర్తించు.. అని దేవుడు చెప్పాడు’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ సమయంలో పార్టీని ఎలా నడపాలో కూడా తెలియని సందిగ్దంలో ఉన్నానన్నారు.

తాను ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. తన మిత్రుడు త్రివిక్రమ్ మాత్రం తన గురించి ఆలోచించాడని పవన్ చెప్పారు. తన కోసం ప్రత్యేకంగా స్క్రిప్టులు రాసి.. సినిమాలు తెచ్చి పెట్టాడన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం ఆయనకు అసలు ఇష్టం లేదన్నారు. జల్సాలో అనేక డైలాగ్‌లు రాసి.. రాజకీయాలకు వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేశాడని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. ఆయన మాట వినకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అయినప్పటికీ త్రివిక్రమ్ తనను భరిస్తూనే ఉన్నాడన్నారు. ‘నన్ను నా కుటుంబం, నా రక్తం ఎంత అర్థం చేసుకుందో తెలియదు కానీ.. ఎక్కడెక్కడో ఉన్న వారు నన్ను చాలా అబిమానిస్తారు.. అర్థం చేసుకుంటారు.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2024 | 03:26 PM

Advertising
Advertising