ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతాం: విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:36 PM

విశాఖపట్టణం లోక్ సభ పరిధిలో కూటమి అభ్యర్థులు గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. విశాఖలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి వర్తించే విధంగా ఎజెండా రూపొందించామని ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు.

TDP BJP And Janasena Candidates Are Meet The Vizag TDP Office

విశాఖపట్నం: విశాఖపట్టణం లోక్ సభ పరిధిలో కూటమి అభ్యర్థులు గురువారం నాడు తెలుగుదేశం పార్టీ (TDP) కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. విశాఖలో (Vizag) ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి వర్తించే విధంగా ఎజెండా రూపొందించామని ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. పొత్తుకు ఓటేద్దాం విశాఖని గెలిపిద్దాం అనే పోస్టర్ విడుదల చేశారు. పొత్తు గెలవాలి.. పాలన మారాలి అనేది తమ నినాదం అని వివరించారు. గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగిందని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.


ఎన్నికలకు సంబంధించి ఐదు అంశాలపై చర్చించామని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తామే ఇస్తున్నామని జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్‌ను జగన్ మూసివేశారని తెలిపారు. మద్య నిషేధం అని చెప్పి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులైపారించారని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మాట్లాడుతూ.. విశాఖలో జగన్ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని పేర్కొన్నారు. పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని విమర్శించారు.


ఇవి కూడా చదవండి:

ResignJagan: అవ్వా, తాతలకు మద్దతుగా నెటిజన్లు.. ట్రెండింగ్‌లో రిజైన్ జగన్ హ్యాష్ ట్యాగ్

AP Politics:షర్మిలను చూస్తే జగన్‌‌కు భయం: వైఎస్ సునీత

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 08:42 PM

Advertising
Advertising