ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bode Prasad: కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలూ లేవ్..

ABN, Publish Date - Mar 21 , 2024 | 12:42 PM

టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై నేడు ఆయన స్పందించారు. మీడియాతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు.

విజయవాడ: టీడీపీ (TDP) తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ (Bode Prasad) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై నేడు ఆయన స్పందించారు. మీడియాతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు. తనకు వంశీ, కొడాలితో సత్సంబంధాలు ఉంటే తాను ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధం లేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నానని బోడె ప్రసాద్ వెల్లడించారు. భువనేశ్వరి (Nara Bhuvaneswari) మీద వంశీ ఆరోపణలు చేసినపుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని తెలిపారు. పార్టీ కోసం పని చేయటమే తనకు తెలుసని.. పని చేయటం రాని వాళ్ళు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ? అని బోడె ప్రసాద్ ప్రశ్నించారు.

MLA Kannababu: వైసీపీ ఎమ్మెల్యే నోటి దురుసు.. రోడ్ల దుస్థితి బాగోలేదన్న వ్యక్తిపై..

పెనమలూరు నియోజకవర్గంపై కసరత్తు మొదలుపెట్టిన టీడీపీ.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొడే ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదని కొద్ది రోజుల క్రితం తెలిపింది. ఈ మేరకు ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ సారి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని టీడీపీ హైకమాండ్ దూతలు ఆయనకు ఫోన్‌లో చెప్పారు. అప్పటి నుంచి రచ్చ మొదలైంది. తాను ఓటమి చెందిన సమయంలో కూడా ఇంత ఆవేదన చెందలేదని బోడె ప్రసాద్ నాలుగు రోజుల క్రితం తెలిపారు. ఈ ఐదేళ్లు కుటుంబాన్ని వదిలి పార్టీ కోసమే తన జీవితం అంకితం చేశానని అన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తాను చాలా బాధ పడుతున్నానని వాపోయారు. తాను చంద్రబాబుకి భక్తుడినేనని ఆయన ఆదేశిస్తే శిరసావహిస్తానని అన్నారు. చంద్రబాబు కుటుంబం నుంచి వస్తేనే అభ్యర్థిని తాము స్వాగతిస్తామని తెలిపారు. వారు కాకుండా బయటి వారికి టిక్కెట్ ఇస్తే తాను స్వతంత్రంగా గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తేల్చిచెప్పారు.

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 12:42 PM

Advertising
Advertising