Share News

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?

ABN , Publish Date - Mar 21 , 2024 | 11:20 AM

Andhrapradesh: జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి. జనసేనలోనూ పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?

తిరుపతి, మార్చి 21: జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును తిరుపతి టీడీపీ నేతలు (TDP Leaders) అంగీకరించని పరిస్థితి. జనసేనలోనూ (Jenasena) పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని జనసేన, టీడీపీ అదిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేడు మంగళగిరి జనసేన ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆ పార్టీ నేత నాగబాబుతో (Janasena Leader Nagababu) తిరుపతి జనసేన నేతలు సమావేశం కానున్నారు. తిరుపతి సీటును టీడీపీకి ఇచ్చి, చిత్తూరు గాని, మదనపల్లి గాని జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాని పక్షంలో టీడీపీలోని తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Eelection Commission: మచిలీపట్నంలో ఏకంగా ఆరుగురు వాలంటీర్లపై వేటు

తొలి నుంచి కీలకమే!
కాగా.. తిరుపతి జనసేన సీటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఖరారైంది. టీడీపీ-బీజేపీలతో పొత్తు కూటమిలో ఉన్న జనసేనకు తిరుపతి సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలి నుంచీ కీలకమే. ప్రతిసారీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది. అయితే స్థానికులైన బలిజలకే టికెట్‌ కేటాయించాలన్న డిమాండ్‌ గట్టిగా వినిపిస్తున్న నేపధ్యంలో ఆరణికి టికెట్‌ ఖరారు చేయడం వివాదానికి దారి తీసింది.

Hyderabad: పార్కింగ్‌కు సమగ్ర పాలసీ.. సమస్యకు చెక్‌ పెట్టేలా జీహెచ్‌ఎంసీ కసరత్తు

సుగుణమ్మ వ్యాఖ్యలకు అర్ధమేంటో?
మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌పై టీడీపీ నేత సుగుణమ్మ (TDP Leader Sugunamma) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని.. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట బయటపెట్టేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరణి శ్రీనివాసులును జనసేన - టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని అన్నారు. కూటమిలో ఏ పార్టీ అయినా, అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని.. గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి స్థానికులై ఉండాలన్నారు. తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతరులు వద్దు అని అంటున్నారని తెలిపారు. అవసరమైతే జనసేన తరఫున తాను పోటీ చేస్తానని సుగుణమ్మ ప్రకటన చేశారు. కాగా.. తిరుపతి ఎమ్మెల్యే తానే అని.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ తన వెంటనే ఉన్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరణి శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమల ఎమ్మెల్యే టిక్కెట్ అంశం హాట్ టాపిక్ అయ్యింది.

ఇవి కూడా చదవండి...

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం

AP Elections 2024: ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కష్టమేగా జగన్!!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 11:25 AM