Share News

MLA Kannababu: వైసీపీ ఎమ్మెల్యే నోటి దురుసు.. రోడ్ల దుస్థితి బాగోలేదన్న వ్యక్తిపై..

ABN , Publish Date - Mar 21 , 2024 | 11:37 AM

ఎన్నికలు అయిపోయాక ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే దెబ్బ గట్టిగానే పడుతుంది. మరి ఆ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకో గానీ అర్థం కావడం లేదా? లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు. నోటికి కాస్త గట్టిగానే పని చెబుతున్నారు.

MLA Kannababu: వైసీపీ ఎమ్మెల్యే నోటి దురుసు.. రోడ్ల దుస్థితి బాగోలేదన్న వ్యక్తిపై..

అనకాపల్లి: ఎన్నికలు (Elections) అయిపోయాక ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే దెబ్బ గట్టిగానే పడుతుంది. మరి ఆ విషయం వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేలకు ఎందుకో గానీ అర్థం కావడం లేదా? లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు. నోటికి కాస్త గట్టిగానే పని చెబుతున్నారు. తాజాగా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు (MLA Kannababu) నోటి దురుసు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది.

Eelection Commission: మచిలీపట్నంలో ఏకంగా ఆరుగురు వాలంటీర్లపై వేటు

అసలేం జరిగిందంటే..

ఓ వ్యక్తి తమ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. కనీసం పట్టించుకోరా? అంటూ ఎమ్మెల్యే కన్నబాబును ఫోన్ చేసి మరీ నిలదీశాడు. అలాగే కొన్ని చోట్ల రోడ్లు సగమే వేసి మధ్యలో ఆపేస్తున్నారని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశాడు. దీనికి ఎమ్మెల్యే నుంచి దారుణమైన రియాక్షన్ వచ్చింది. ‘‘సగంలో రోడ్లు వేసి ఆపేస్తున్నారని నాకు తెలియదా ఏమిటి? చెప్పడానికి నువ్వు ఎవడు?..ముందు ఫోన్ పెట్టు’’ అంటూ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే దురుసు సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమస్యపై నిలదీస్తే ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం

గతంలోనూ..

ఎమ్మెల్యే కన్నబాబుకు నోరు మాత్రమే కాదు.. చేయి దురుసు కూడా కాస్త ఎక్కువే. గతంలో గడగడపకు కార్యక్రమంలో సొంత పార్టీ నేతలే ఆయనను అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపైకి ఆగ్రహంతో దూసుకెళుతుండగా.. ఆయన పీఏ నవీన్ వర్మ కన్నబాబు చేయి పట్టుకుని వారించేందుకు యత్నించారు. వెంటనే నవీన్ వర్మ చెంపను కన్నబాబు ఛెల్లుమనిపించారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్. ఇక మరోసారి ఏకంగా ఓ విద్యార్థి పైకే దూసుకెళ్లారు. ఇది కూడా అనకాపల్లి మండలం మునగపాక మండలం నాగులాపల్లిలో గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడే జరిగింది. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించిన సమయంలో శంకర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్లగా.. ఆయన కుమారుడు తాను ఐటీఐ పూర్తి చేశానని తనకు విద్యాదీవెన రాలేదని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే సదరు విద్యార్థిని కొట్టినంత పని చేశారు.

TDP-Janasena: తిరుపతి సీటుపై కీలక పరిణామం.. ఆరణి కొనసాగుతారా?

Updated Date - Mar 21 , 2024 | 12:49 PM