Khammam: కందిపప్పు @ 200
ABN, First Publish Date - 2023-09-05T13:18:02+05:30
బహిరంగ మార్కెట్‌లో పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కందిపప్పు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం
- రోజురోజుకు పెరుగుతున్న ధర
- మిగతా పప్పుల ధరలూ అదే దారిలో
ఖమ్మం: బహిరంగ మార్కెట్‌లో పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కందిపప్పు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ. 180 నుంచి రూ.200 ఉండగా.. మిగతా పప్పులు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. పెసరపప్పు కిలో రూ.130, మినపప్పు, గుండ్లు రూ.130 నుంచి రూ.140, బొబ్బరపప్పు రూ.120, పచ్చి శనగపప్పు రూ.80 నుంచి రూ.90, మైసూర్‌పప్పు రూ.100కు చేరాయి. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే ఈ ఏడాది తృణధాన్యాల సాగు తగ్గడం, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇక ఈ పప్పులతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడం సామాన్యులకు భారంగా మారింది. మున్ముందు కందిపప్పు ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
Updated Date - 2023-09-05T13:18:04+05:30 IST