Arvind : లక్ష కోట్లను కేసీఆర్ నీటి పాలు చేశారు
ABN, First Publish Date - 2023-11-23T18:42:05+05:30
లక్ష కోట్లను కేసీఆర్ ( KCR ) నీటి పాలు చేశారని బీజేపీ ఎంపీ అరవింద్ 9 Arvind ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధారిలో బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డి తరఫున ఎంపీ అరవింద్ ప్రచారం చేశారు.
కామారెడ్డి జిల్లా: లక్ష కోట్లను కేసీఆర్ ( KCR ) నీటి పాలు చేశారని బీజేపీ ఎంపీ అరవింద్ 9 Arvind ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధారిలో బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డి తరఫున ఎంపీ అరవింద్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ..‘‘కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను గెలిపించెందుకే రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నాడు. కామారెడ్డిలో బీజేపీని ఓడించడానికి కుట్ర చేశారు. రేవంత్‌రెడ్డి, కవిత బిజినెస్ పార్టనర్స్. రేవంత్‌రెడ్డి నోట్ల కేసును బయటకు రాకుండా కేసీఆర్ కాపాడుతున్నాడు. ఎల్లారెడ్డిని కాషాయ మయంగా మార్చుదాం.మోదీ ఉచిత బియ్యం ఇస్తున్నారు. కేసీఆర్ మాత్రం రేషన్ కార్డులను ఇస్తాల్లేరు. రేవంత్‌రెడ్డి అమ్ముడు పోయాడు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ 5 సీట్లు గెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నీతి లేదు’’ అని అరవింద్ ఎద్దేవ చేశారు.
Updated Date - 2023-11-23T18:42:06+05:30 IST