ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ.. మరోవైపు స్మార్ట్ ఫోన్‌తో ఇతను చేస్తున్న పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Dec 16 , 2023 | 07:39 PM

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు రన్నింగ్ రైలును ఎక్కుతూ, దిగుతూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ...

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు రన్నింగ్ రైలును ఎక్కుతూ, దిగుతూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ముంబైలో ఎక్కువగా చోటు చేసుకోవడం తెలిసిందే. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు రైల్లో ఫుడ్ బోర్డు ప్రయాణం చేస్తూ తన ఫోన్ వాడిని తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.

ముంబై లోకల్ రైల్లో (Mumbai Local Train) ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ముంబైలోని లోకల్ రైళ్లలో ప్రయాణం చేయాలంటే పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. అడుగుతీసి అడుగు పెట్టడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి. అయినా ఆడామగా తేడా లేకుండా ప్రమాదకరంగా ప్రయాణం చేయడం సర్వసాధారణమైంది. తాజాగా, రైల్లో ఓ యువకుడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. సదరు వ్యక్తి.. రద్దీగా ఉన్న రైల్లో తలుపు వద్ద ప్రమాదకరంగా నిల్చున్నాడు. అంతటితో ఆగకుండా ఆ సమయంలోనూ ఫోన్ వినియోగించకుండా ఉండలేకపోయాడు. ఇందుకోసం అతను వినూత్నంగా ఆలోచించి, తన ఫోన్‌ని బోగీ వెలుపల పైభాగంలో ఇరికించాడు.

Optical illusion: ఈ గ్రామంలో సింహం దాక్కుని ఉంది.. కనిపెట్టగలిగితే మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

అలా ఇయర్ ఫోన్స్ సాయంతో పాటలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు ఇతడి నిర్వాకం చూసి షాక్ అయ్యారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నట్టున్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు సొంతం చేసుకుంది.

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తున్న యువకుడిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడో మీరే చూడండి..

Updated Date - Dec 16 , 2023 | 07:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising