Share News

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తున్న యువకుడిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడో మీరే చూడండి..

ABN , Publish Date - Dec 16 , 2023 | 06:49 PM

కొందరికి సాహసాలంటే చాలా ఇష్టం. మరికొందరు ఎవరూ చేయని సాహసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇంకొందరు వినూత్న విన్యాసాలు చేస్తూ...

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తున్న యువకుడిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడో మీరే చూడండి..

కొందరికి సాహసాలు చేయడం అంటే చాలా సరదా. మరికొందరు ఎవరూ చేయని సాహసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇంకొందరు వినూత్న విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. పారాగ్లైడింగ్ చేసే వారిని రోజూ చాలా మందిని చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వ్యక్తి పారాగ్లైడింగ్ చేసే పద్ధతి చూస్తే మీరు కూడా అవాక్కవుతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. పంజాబ్‌కు (Punjab) చెందిన హర్ష్ అనే వ్యక్తి అందరిలా కాకుండా వినూత్నంగా పారాగ్లైడింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) బండ్లధార్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అతడు పారాగ్లైడింగ్ చేసిన పద్ధతిని చూసి అంతా అవాక్కవుతున్నారు. బైకుపై కూర్చుని పారాగ్లైడింగ్ చేస్తే ఎలా (Paragliding on bike) ఉంటుందని ఆలోచించిన అతను.. వెంటనే దాన్న ఆచరణలో పెట్టేశాడు. పారాచూట్‌కు ఉన్న తాళ్లను బైక్‌కు కట్టి, దానిపై కూర్చుని గాల్లోకి దూసుకెళ్లాడు.

Optical illusion: ఈ గ్రామంలో సింహం దాక్కుని ఉంది.. కనిపెట్టగలిగితే మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

చూసేందుకు అతను.. బైకుపై నింగిలోకి దూసుకెళ్తున్నట్లు కనిపించింది. మొత్తానికి అతను బైకుపై చేసిన పారాగ్లైడింగ్ విజయవంతమైంది. క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప్రయోగాలు చాలా అరుదు కావడంతో చాలా మంది అతన్ని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పారాగ్లైడింగ్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘వావ్! చూడటానికి ఎంతో బాగుంది’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Photo: ఇది మీ కంటికి పరీక్ష.. ఇందులో ఎలుక ఎక్కడ దాక్కుందో చెప్పగిలిగితే మీరు నిజంగా గ్రేటే..

Updated Date - Dec 16 , 2023 | 06:51 PM