Share News

Viral: యువతి పిలవగానే డాన్స్‌ ఇరగదీసిన పోలీసు.. అయితే తర్వాత జరిగింది తెలుసుకుని ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:59 PM

రైళ్లలో చోటు చేసుకునే విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరు రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరికీ నవ్వు తెప్పిస్తుంటే.. మరికొందరు చేసే పనుల కారణంగా చాలా మంది షాక్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా...

Viral: యువతి పిలవగానే డాన్స్‌ ఇరగదీసిన పోలీసు.. అయితే తర్వాత జరిగింది తెలుసుకుని ఖంగుతిన్నాడు..

రైళ్లలో చోటు చేసుకునే విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరు రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరికీ నవ్వు తెప్పిస్తుంటే.. మరికొందరు చేసే పనుల కారణంగా చాలా మంది షాక్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో ఓ కానిస్టేబుల్ యువతి పిలవగానే డాన్స్ ఇరగదీశాడు. అయితే తర్వాత జరిగింది తెలుసుకుని ఖంగుతిన్నాడు.

ముంబై లోకల్ రైల్లో (Mumbai local train) డిసెంబర్ 6న ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ ఎస్ గుప్తా అనే హోంగార్డు.. ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో విధుల్లో ఉన్నాడు. అయితే రైలు కదిలిన కొద్ది సేపటికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. గేటు వద్ద నిలబడి ఉన్న అతడి వద్దకు ఓ యువతి వచ్చింది. వచ్చీ రాగానే ఆమె.. కానిస్టేబుల్‌ను చూసి డాన్స్ చేయడం మొదలెట్టింది. మధ్యలో డాన్స్ ఆపేసి, కానిస్టేబుల్‌ను చూసి సిగ్గుపడుతుంది. దీంతో అతను కూడా.. ‘‘రైల్లో ఇలాంటివి చేయొద్దు, కిందకు దిగాక చేసుకోండి’’.. అని మొదట సలహా ఇస్తాడు. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. యువతితో (policeman) danced with the young woman) పాటూ అతనూ స్టెప్పులు వేస్తాడు. దీంతో యువతి మరింత ఉత్సాహంతో డాన్స్ చేయడం మొదలెడుతుంది.

Viral Video: ఇదేందయ్యా.. ఇది... లేజర్ లైటుతో మొసలికే చుక్కలు చూపించాడుగా...

పోలీసు కూడా ఆమెతో పోటీపడి మరీ డాన్స్ చేస్తాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ అవడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. దీనిపై నిజానిజాలు తెలుసుకుని హోంగార్డుపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ వీడియోలు, ఫొటోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పోలీసు టాలెంట్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, ‘‘వారించాల్సింది పోయి.. ఇలా డాన్సులు చేయడం ఏంటి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అనుకోకుండా తారసపడ్డ రెండు కోతులు.. ఎలా పలకరించుకున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

Updated Date - Dec 14 , 2023 | 06:59 PM