Share News

Viral Video: ఎముకలు కొరికే చలిలోనూ.. ఈ జవాన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

ABN , First Publish Date - 2023-12-09T20:28:47+05:30 IST

దేశ భద్రతే ధ్యేయంగా సైనికులు నిత్యం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. అందుకే అంతా వారిని రియల్ హీరోస్ అని పిలుస్తుంటారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లు నిత్యం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయినా...

Viral Video: ఎముకలు కొరికే చలిలోనూ.. ఈ జవాన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

దేశ భద్రతే ధ్యేయంగా సైనికులు నిత్యం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. అందుకే అంతా వారిని రియల్ హీరోస్ అని పిలుస్తుంటారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లు నిత్యం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయినా తమ కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. జవాన్లకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎముకలు కొరికే చలిలోనూ కొందరు జవాన్లు సరదా సరదా జోకులు వేసుకుంటూ గడపడం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొంత మంది సైనికులు (Indian Army Soldiers) మంచు పర్వతం మీద విధులు నిర్వర్తిస్తుంటారు. గడ్డ కట్టే ఆ చలిలోనూ వారంతా ఎంతో ఉత్సాహంగా పని చేస్తుంటారు. అయితే ఈ సమయంలో వారి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భోజన సమయంలో అంతా వారి వద్ద ఉన్న చపాతీలు (Chapati) బయటకు తీస్తారు. అయితే విపరీతమైన చలి కారణంగా అవి అప్పటికే బిగుసుకుపోయి ఉంటాయి. అయినా సైనికులంతా వాటిని తీసుకుని, కూరలో మిక్స్ చేసుకుని తింటుంటారు. ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తి చపాతీని సగం తుంచేయాలని ప్రయత్నిస్తాడు.

Viral Video: సైకిల్‌కి, చెప్పులకు నిప్పు.. చలిని తట్టుకునేందుకు ఇతడు చేసిన పని చూడండి..

అయితే అది సాధ్యం కాకపోవడంతో పక్కన ఉన్న స్నేహితుడితో.. ‘‘దీన్ని కత్తిరించడానికి రంపం కావాలేమో’’.. అని నవ్వుతూ అంటాడు. ఇందుకు బదులుగా పక్కన ఉన్న వారు.. ‘‘మిగతా రోజులతో పోలిస్తే.. ఈరోజు చపాతీలు కొంచెం మెత్తగా ఉన్నాయ్’’.. అని అంటారు. ఇలా అంతా సరదాగా నవ్వకుంటూ భోజనం ముగించేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇండియన్ ఆర్మీ.. ధైర్యసాహసాలకు వందనం’’.. అంటూ కొందరు, ‘‘సైనికులు నిజంగా రియల్ హీరోస్’’.. అంటూ మరికొందరు, ‘‘అంతటి కష్టంలోనూ ఎంత ఆనందంగా ఉన్నారు’’.. అని ఇంకొందరు, ‘‘వీరిని చూసి ఎంతో మంది నేర్చుకోవాలి’’.. అంటూ చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1 మిలియన్ వ్యూస్‍‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తనకు సంబంధం లేకున్నా.. చొరవ తీసుకుని మరీ.. ఈ ఎయిర్ హోస్టెస్ చేసిన పని చూడండి..

Updated Date - 2023-12-09T20:32:22+05:30 IST