Share News

Viral Video: వరుడు ఒక్కడే.. వధువులు మాత్రం ఏకంగా నలుగురు.. కనీవినీ ఎరుగని అరుదైన పెళ్లి..!

ABN , First Publish Date - 2023-12-08T21:36:44+05:30 IST

పెళ్లికి సంబంధించిన ఎలాంటి సంఘటన అయినా ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వధూవరులు చేసే పనులు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు వధూవరులు పెళ్లి మంటపంలో...

Viral Video: వరుడు ఒక్కడే.. వధువులు మాత్రం ఏకంగా నలుగురు.. కనీవినీ ఎరుగని అరుదైన పెళ్లి..!

పెళ్లికి సంబంధించిన ఎలాంటి సంఘటన అయినా ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వధూవరులు చేసే పనులు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు వధూవరులు పెళ్లి మంటపంలో ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నలుగురు వధువులతో వరుడు ఏడు అడుగులు వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘‘ఇది కనీవినీ ఎరుగని అరుదైన పెళ్లి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి వివాహం (marriage) గురించి నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులు ( bride and groom) హోమం చుట్టూ ఏడుఅడుగులు వేసేందుకు సిద్ధమవుతారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అంతా షాక్ అయ్యే ఘటన చోటు చేసుకుంది. వరుడు తన వెంట ఏకంగా నలుగురు వధువులతో కలిసి ఏడు అడుగులు వేయడం చూసి అంతా అవాక్కయ్యారు.

Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడో వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకుంటూ వచ్చిన పులి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత.. వధువులంతా కలిసి వరుడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ సమయంలో పక్కన ఉన్న వారంతా పూలు చల్లుతూ వారిని ఆశీర్వదిస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదంతా నవ్వుకోవడం కోసమే చేసినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇక్కడ ఒకరికే దిక్కులేకుంటే.. ఏకంగా నలుగురా..!’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Spy Apps: గూగుల్ డిలీట్ చేసిన 17 యాప్స్ లిస్ట్ ఇదీ.. మీ ఫోన్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలీట్ చేసేయండి..!

Updated Date - 2023-12-08T21:36:47+05:30 IST