Share News

Viral Video: రోడ్డుపై నడుస్తున్న ఇద్దరమ్మాయిలు.. వాళ్ల పక్కగా వచ్చిందో బస్.. ఓ యువతి చేసిన పిచ్చి పనితో..!

ABN , First Publish Date - 2023-12-06T19:45:24+05:30 IST

కొందరు చేసే పిచ్చి పిచ్చి పనుల కారణంగా ఎదుటివారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఆకతాయిల కారణంగా కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల రీల్స్ పేరుతో ఎంతో మంది యువతీయువకులు.. ఆకతాయి పనులు చేస్తూ...

Viral Video: రోడ్డుపై నడుస్తున్న ఇద్దరమ్మాయిలు.. వాళ్ల పక్కగా వచ్చిందో బస్.. ఓ యువతి చేసిన పిచ్చి పనితో..!

కొందరు చేసే పిచ్చి పిచ్చి పనుల కారణంగా ఎదుటివారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఆకతాయిల కారణంగా కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల రీల్స్ పేరుతో ఎంతో మంది యువతీయువకులు.. ఆకతాయి పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇద్దరు యువతులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అదే సమయంలో ఓ బస్సు వాళ్ల పక్కగా వచ్చింది. ఈ క్రమంలో ఓ యువతి చేసిన పిచ్చి పనితో చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు సరదాగా మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటారు. అదే సమయంలో వారి పక్కగా ఓ బస్సు కూడా వెళ్తుంటుంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. వారిలో ఓ యువతి మరో యువతిని ఒక్కసారిగా రోడ్డు పక్కకు నెట్టేస్తుంది. దీంతో ఆమె తనని తాను నియంత్రించుకోలేక.. (young woman fell under the bus) సడన్‌గా బస్సు కింద పడుతుంది. అయితే అప్పటికే బస్సు ముందు, వెనుక చక్రాలు దాటి పోవడంతో ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు.

Ambulance: నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. అదుపుతప్పి నదిలో పడిపోయిన అంబులెన్స్.. చివరకు జరిగింది ఇదీ..!

కిందపడ్డ యువతి బస్సు వెళ్లగానే వెంటనే పైకి లేచి భయపడుతూ ఉంటుంది. ఆమెను తోచేసిన యువతి కంగారుపడుతూ.. సారీ సారీ.. అంటూ స్నేహితురాలిని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘స్నేహం ముసుగులో శాడిజం చూపించింది’’.. అంటూ కొందరు, ‘‘ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టకుందో’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Metro Train: బాబోయ్.. మెట్రో రైల్లో ఏందీ రచ్చ..? ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్.. వేడుక చూసిన ప్రయాణీకులు..!

Updated Date - 2023-12-06T19:45:27+05:30 IST