Share News

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. పైకొచ్చే సమయంలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఒకే ఒక్క ట్రిక్‌తో..

ABN , First Publish Date - 2023-12-05T19:43:49+05:30 IST

దాదాపు ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో కొన్నిసార్లు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్ని సార్లు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకున్న వారు అనూహ్యంగా క్షేమంగా బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు...

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. పైకొచ్చే సమయంలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఒకే ఒక్క ట్రిక్‌తో..

దాదాపు ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో కొన్నిసార్లు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్ని సార్లు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకున్న వారు అనూహ్యంగా క్షేమంగా బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి జలకన్య వేషధారణలో నీటిలోకి దిగింది. అయితే తిరిగి పైకొచ్చే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఆమె ఒకే ఒక్క ట్రిక్‌తో ఎలా బయటికి వచ్చిందంటే..

దక్షిణాఫ్రికాలో (South Africa) చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని రాండ్‌బర్గ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న షాపింగ్ మాల్లో ఓ భారీ ఆక్వేరియాన్ని (aquarium) ఏర్పాటు చేశారు. సముద్ర అడుగుభాగం ఎలా ఉంటుందో అచ్చం ఇందులో కూడా అలాగే ఏర్పాటు చేశారు. అలాగే వివిధ రకాల చేపలను కూడా అందులో వదిలారు. అయితే సందర్శకులను ఆకట్టుకునేందుకు మరో అడుగు ముందుకేసి, జలకన్యలను కూడా సిద్ధం చేశారు. కొందరు యువతులు జలకన్య వేషధారణలో (women in mermaid costume) ఆక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ నిజమైన జలకన్యలను తలపిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Accident Video: రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్న స్కూలు బస్సు.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. చివరకు ఏం తెలిసిందంటే..

ఈ క్రమంలో ఓ యువతి జలకన్య వేషధారణలో నీటిలోకి దిగింది. సందర్శకులంతా ఆమెను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. నీటి దిగువభాగానికి వెళ్లిన ఆమె.. తిరిగి పైకి వచ్చే క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. చేప ఆకారంలో ఉన్న ఆమె డ్రస్.. అడుగు భాగంలో చిక్కుకుంది. దీంతో కాసేపు ఊపిరాడక ఉక్కిరిబక్కిరి అయింది. అయితే వెంటనే తెలివిగా ఆలోచించి, జలకన్య డ్రస్‌ను విప్పేసి వేగంగా ఈతకొడుతూ పైకి వచ్చేసింది. ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం అయ్యున్నా... ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఈ ఘటనతో సందర్శకులంతా షాక్ అయ్యారు. అయితే యువతి చాకచక్యంగా బయటికి రావడంతో చివరకు అంతా సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులను అవాక్కయ్యేలా చేసిన వధువు.. కేఎఫ్‌సీ కూడా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం వెనుక..!

Updated Date - 2023-12-05T19:44:00+05:30 IST